బాలికపై సాముహిక అత్యాచారం... ఆపై వీడియో తీసి...

9 Apr, 2022 17:26 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: మహిళలు, బాలికల భద్రతకై ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నెన్ని చట్టాలు తీసుకువస్తున్నప్పటకీ ఈ అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. మైనర్లు, చిన్నపిల్లలు అని చూడకుండా వారిపై అఘాయిత్యాలకు పాల్పడటమే కాకుండా వీడియోలు తీసి బెదిరించడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే బెంగళూరులో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే....బెంగళూరులో 16 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ ఘటనను వీడియో తీసి తన స్నేహితులకు షేర్‌చేశాడు. అంతేకాకుండా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుందని బెదిరిస్తూ తన ఏడుగురు స్నేహితులతో కలిసి ఆ బాలిక పై మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఈ ఘటన బెంగళూరులోని యలహంకలో చోటుచేసుకుంది. అయితే బాధితురాలు ఆ నిందితుడి ఆగడాలు భరించలేక ఏడుస్తూ ఇంటికి రావడంతో.. తల్లిదండ్రులు ఏం జరిగిందో చెప్పమని ఆమెను బలవంతం చేశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.  ఈ మేరకు  బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మరొక నిందుతుడి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

(చదవండి: పరీక్షలు రాయాలి.. బెయిల్‌ వచ్చిందని తెలియక విచారణ ఖైదీ ఆత్మహత్య)

మరిన్ని వార్తలు