2 వారాల్లో పెళ్లి కావాల్సిన యువతిపై లైంగిక దాడి.. ఫొటోలు తీసి పెళ్లికొడుకు వాట్సాప్‌కు

13 Nov, 2021 15:49 IST|Sakshi
రాజేందర్‌రెడ్డి, ఆంజనేయులు

మద్యం తాగించి అఘాయిత్యం

ఫొటోలు, వీడియోలు తీసి పెళ్లికొడుకుకు పంపిన వైనం

ఈ నెల 5న ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి  

ఇద్దరు వ్యక్తులను రిమాండ్‌కు తరలించిన పోలీసులు 

మహబూబ్‌నగర్‌ క్రైం: రెండు వారాల్లో పెళ్లి కాబోతున్న యువతిపై ఇద్దరు లైంగిక దాడి చేయడమేగాక.. ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి సదరు పెళ్లికొడుకుకి పంపారు. ఈ నెల 5న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం కోత్లాబాద్‌కి చెందిన ఓ అమ్మాయి(20) ప్రతిరోజూ మహబూబ్‌నగర్‌కు వచ్చి దినసరి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే మల్కాపూర్‌కి చెందిన రాజేందర్‌రెడ్డి అలియాస్‌ రాజు కొత్లాబాద్‌ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

చదవండి: (దిగొచ్చిన చికెన్‌ ధర.. లొట్టలేస్తున్న మాంసం ప్రియులు)

ప్రస్తుతం ఆమె తల్లిగారి ఇంటి వద్ద ఉండటంతో రాజు కూడా ప్రతిరోజూ కొత్లాబాద్‌ నుంచి బైక్‌పై మహబూబ్‌నగర్‌కు వచ్చి పెయింటింగ్‌ పని చేసేవాడు. ఈ క్రమంలో దినసరి కూలీగా పని చేసే అమ్మాయిని రాజు చాలాసార్లు బైక్‌పై ఎక్కించుకుని రావడంతో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈనెల 5న ఆ అమ్మాయి పని కోసం జిల్లాకేంద్రంలోని టీడీగుట్ట గేటు దగ్గరకు వచ్చింది. ఆరోజు పని దొరకకపోవడంతో రాజు అతని స్నేహితుడు, ఆంజనేయులు కలిసి ఆమె వద్దకు వెళ్లారు.

చదవండి: (ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..)

వేరే చోట పని ఇప్పిస్తామని చెప్పి బైక్‌పై ఎక్కించుకుని ఫతేపూర్‌ అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ ఆమెకు బలవంతంగా మద్యం తాగించి, లైంగిక దాడికి పాల్పడ్డారు. రాజు అత్యాచారం చేసేటప్పుడు ఆంజనేయులు ఫొటోలు, వీడియోలు తీశాడు. విషయం బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారు. కాగా, ఈ నెల 18న ఆ అమ్మాయికి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లైంగిక దాడి ఫొటోలు, వీడియోలను సదరు పెళ్లికొడుకు వాట్సాప్‌కు పంపారు.

చదవండి: (సెంట్రల్‌ జైలులో ఉంచినా.. నమ్మిన జెండా వీడలేదు.. సమర్థతను గుర్తించి)

ఆ ఫొటోలను పెళ్లికొడుకు అమ్మాయి తల్లిదండ్రులకు చూపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై 2 రోజుల క్రితం అమ్మాయి, తల్లిదండ్రులు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసి శుక్రవారం రాజు, ఆంజనేయులును అరెస్టు చేసి రిమాండ్‌ తరలించినట్లు వన్‌టౌన్‌ సీఐ రాజేశ్వర్‌గౌడ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు