షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి

3 Sep, 2022 13:01 IST|Sakshi
సుజాత ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో నిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన సుజాత శనివారం ప్రాణాలు విడిచారు. సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో గతంలో సుజాత ఇంటిపై దాడి చేసిన ఏసీబీ అధికారులు.. ఆమెను అరెస్ట్‌ చేశారు. 

ఏసీబీ దాడుల అనంతరం ఏడాది క్రితమే సుజాత భర్త  ఆత్మహత్య పాల్పడ్డాడు. అప్పటి నుంచి తీవ్రమైన మానసిక క్షోభతో బాధపడుతున్న సుజాతకు మళ్లీ విధుల్లోకి చేరేందుకు అవకాశం ఇచ్చినా ఆమె తిరస్కరించారు. క్రమంలోనే డిప్రెషన్‌లోకి వెళ్లిన సుజాత.. ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తొలుత ప్రచారం జరిగింది. అయితే తాజాగాకు ఆమె గుండెపోటుతో మృతిచెందినట్టుగా తెలుస్తోంది. 

సుజాత మృతిని ధృవీకరించిన వైద్యులు
మాజీ ఎమ్మార్వో సుజాత మృతిని వైద్యులు ధృవీకరించారు. గత వారం క్రితం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్‌కు తీసుకు వచ్చినట్లు తెలిపారు. మరోవైపు సుజాతకు క్యాన్సర్ కూడా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అదే సమయంలో డెంగీ కూడా సోకడంతో వైద్యులు ట్రీట్‌మెంట్‌ మొదలు పెట్టారు. అయితే చికిత్స కొనసాగుతూ ఉండగానే ఈ ఉదయం గుండెపోటుతో సుజాత మృతి చెందినట్లు తెలిపారు. సుజాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు చిక్కడ పల్లికి తరలించారు.

చదవండి: వాట్సాప్‌ గ్రూపునకు అడ్మిన్‌ చేస్తే.. బయటకు తోసేశారు, న్యాయం చేయండి

మరిన్ని వార్తలు