శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు: బంగారం బిస్కెట్లు, 9 ఐఫోన్లు, ధిరామ్‌లు.. డాలర్లు

23 Nov, 2021 08:48 IST|Sakshi

ఎయిర్‌పోర్టులో పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు

సాక్షి, శంషాబాద్‌: ఒకే రోజు మూడు వేర్వేరు కేసులో అక్రమంగా రవాణా జరుగుతున్న బంగారం, విదేశీకరెన్సీ, ఐఫోన్లను శంషాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అర్థరాత్రి షార్జా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా అక్రమంగా తీసుకొచ్చిన 9 ఐఫోన్లు బయటపడ్డాయి. వీటి విలువ 8.37 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. వాటిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

బంగారం ఇలా.. 
ఓ మహిళా ప్రయాణికురాలు దుబాయ్‌ నుంచి సోమవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. తనిఖీల్లో భాగంగా ఆమె వద్ద ఉన్న చేతి సంచిలో మూడు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. 350 గ్రాముల బరువు కలిగిన బంగారం విలువ 17.69 లక్షలు ఉంటుందని అధికారులు నిర్దారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

ధిరామ్‌లు..డాలర్లు.. 
ఇద్దరు మహిళా ప్రయాణికులు సోమవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి షార్జా వెళ్లేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీఐఎస్‌ఎఫ్‌ చేపట్టిన తనిఖీల్లో వారి వద్ద 55000 యుఏఈ ధిరామ్‌లు, 970 యూఎస్‌ డాలర్లు బయటపడ్డాయి. సీఐఎస్‌ఎస్‌ అధికారులకు నిందితులను కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. అక్రమంగా తరలిస్తున్న కరెన్సీ విలువ భారత కరెన్సీలో 11.49 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు