'సామల బుచ్చిరెడ్డితో నాకు ప్రాణహాని ఉంది'

26 Oct, 2020 11:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సామల బుచ్చిరెడ్డితో తనకు ప్రాణహాని ఉందని ఓ యువకుడు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకెళ్తే.. కార్పొరేషన్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 71, 72, 73 ప్లాట్‌ నంబర్‌ 35, 36 పార్ట్‌ స్థలంలో తన బంధవులు ఇల్లు నిర్మాణం చేసుకుంటే మేయర్‌ అనుచరులు ఆ ఇంటిని జేసీబీతో నేలమట్టం చేశారని శివకిషోర్‌ అనే యువకుడు ఆరోపించాడు.

ఈ క్రమంలోనే శివకిషోర్‌.. ఎందుకు ఇల్లు కూలగొడుతున్నారని మేయర్‌ను ప్రశ్నించగా నువ్వెవడు రా..? అని పరుష పదజాలంతో దూషించి, ఏడుగురు వ్యక్తులు రాళ్ల దాడికి దిగినట్లు బాధితుడు వివరించారు. విషయంపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే వీడిపై రౌడీషీట్‌ పెట్టండి. తర్వాత వాడి అంతుచూస్తానని మేయర్‌ సామల బుచ్చిరెడ్డి బెదిరించినట్లు బాధితుడు పేర్కొన్నారు. (కస్టమర్‌ కేర్‌ కాదు.. ఖాతా కొల్లగొట్టుడే!)

మరిన్ని వార్తలు