సిద్ధూ మూసేవాలా తండ్రిని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు

7 Sep, 2022 21:36 IST|Sakshi

చండీగఢ్‌: సిద్ధూమూవేవాలా తండ్రి బాల్‌కౌర్ సింగ్‌ను చంపుతానని బెదిరించిన వ్యక్తిని పంజాబ్ పోలీసులు ‍అరెస్టు చేశారు. నిందితుడ్ని రాజస్థాన్ జోధ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పంజాబ్‌ మాన్సా కోర్టులో ప్రవేశపెట్టి ఐదు రోజులు రిమాండ్‌లోకి తీసుకున్నారు.

నిందితుడి పేరు మహిపాల్ అని పోలీసులు తెలిపారు. ఈమెయిల్‌ ద్వారా ఇతడు సిద్ధూ తండ్రిని చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు సిద్ధూ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏజే లారెన్స్ బిష్ణోయ్ పేరుతో సోషల్‌ మీడియాలో పేజీ కూడా క్రియేట్ చేశాడు. ఫాలోవర్లను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే సిద్ధూ తండ్రికి మహిపాల్‌ బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

సిద్ధూ హత్యకు సంబంధించి కెన్యాలో అన్మోల్ బిష్ణోయ్‌, అజర్‌బైజాన్లో సచిన్ తాపన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు కేంద్రం సెప్టెంబర్ 1న ధ్రువీకరించింది. స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నట్లు చెప్పింది.
చదవండి: థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్‌.. 2024లో సరికొత్త చరిత్ర

మరిన్ని వార్తలు