సింధు మృతికి ప్రియుడే కారణం!?

23 Aug, 2021 03:47 IST|Sakshi
గదిలో విగతజీవిగా పడి ఉన్న సింధు

పోలీసుల అదుపులో నిందితుడు ప్రసేన్‌

గుణదల (విజయవాడ తూర్పు): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడే సీఏ విద్యార్థిని సింధు మృతికి కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. విజయవాడ గుణదలలో శనివారం వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సింధును పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆమె ప్రియుడు ప్రసేన్‌ కొంతకాలంగా మరో యువతితో సంబంధం ఏర్పర్చుకున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఆ యువతిని వివాహం చేసుకునేందుకే సింధును వదిలించుకోవాలని నిర్ణయించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అంటున్నారు. ఇక ఉద్దేశపూర్వకంగానే ప్రసేన్‌ తమ కుమార్తెను హత్యచేశాడని, అతడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. గదిలో సింధు పడిఉన్న తీరు కూడా వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఆమె ఉరికి వేలాడకుండా నేలపై పడి ఉండడం గమనార్హం. ముక్కు నుంచీ తీవ్రంగా రక్తస్రావం జరిగిందని పోలీసులు తేల్చారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు ఆధారపడి ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహంపై గాయాలు, దెబ్బలు వంటివి ఉన్నట్లు రిపోర్టులో వస్తే ఇది హత్య కిందే పరిగణించాల్సి ఉంటుందన్నారు. నిందితుడు ప్రసేన్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు