నిందితుడిని అరెస్టు చేయబోతుండగా... పోలీసులపై దాడి యూనిఫాం చింపి....

26 Aug, 2022 11:56 IST|Sakshi

గురుగ్రామ్‌: ఒక వ్యక్తిని ఫ్రాడ్‌ కేసు విషయమై పోలీసులు అరెస్టు చేసి పోలీస్టేషన్‌కి తరలిస్తున్నారు. ఇంతలో ఆ నిందితుడు ఇద్దరు చెల్లెళ్లు, తల్లి, సోదరుడు పోలీసులపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ ఘటన గుర్గావ్‌లో చోటు చేసుకుంది. దీంతో ఆ ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సదరు నిందితుడి సోదరుడు తప్పించుకున్నాడని చెప్పారు.

ఈ మేరకు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కరంబీర్‌ తమ స్టేషన్‌లో ఒక ఫ్రాడ్‌ కేసు నమోదైందని తెలిపారు. తాము ఆ కేసు విషయమై గత కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఈ కేసుకి సంబంధించి అనుమానితుడు కరణ్‌ సమదర్శ అనే వ్యక్తిని విచారించినట్లు చెప్పారు. అతను ఉత్తరప్రదేశ్‌లో తండా గ్రామంలో తన కుటుంబంతో కలసి ఉంటున్నాడని పేర్కొన్నారు.

ఐతే అతను పోలీసుల విచారణలో నిందితుడిగా తేలడంతో అతన్ని అరెస్టు చేస్తున్నట్లు అతని కుటుంబానికి తెలియజేసి, పోలీస్టేషన్‌కి తరలిస్తున్నారు. ఇంతలో అతడి తల్లి ఇద్దరు చెల్లెళ్లు, సోదరుడు పోలీసు స్టేషన్‌ వద్దకు వచ్చి  పోలీసుల పై దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్‌ సతేందర్‌ యూనిఫాం చిరిగిపోయింది. దీంతో స్టేషన్‌ లోపల ఉన్న మిగతా పోలీసులు సదరు నిందితుడి తల్లి, చెల్లెళ్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కానీ అతని సోదరుడు వరుణ్‌ తప్పించుకున్నాడని, తొందరలోనే అతన్ని కూడా పట్టుకుంటామని చెప్పారు. 

(చదవండి: భార్యను గొడ్డలితో  నరికి చంపిన భర్త )

మరిన్ని వార్తలు