లిఫ్ట్‌ అడిగిన మహిళపై తండ్రీకొడుకుల అఘాయిత్యం

27 Feb, 2021 11:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఉత్తరప్రదేశ్‌ సీతాపూర్‌లో దారుణం

మహిళపై గ్యాంగ్‌రేప్‌.. సజీవ దహనం చేసేందుకు యత్నం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై అత్యాచారం చేసిన తండ్రీ కొడుకులు ఆమెను చంపేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన శుక్రవారం  జరిగింది. వివరాలు.. బాధితురాలు యూపీ సీతాపూర్‌ జిల్లా సిధౌలి ప్రాంతంలోని తన పుట్టింటి నుంచి మిశ్రీఖ్‌లోని అత్తారింటికి వెళ్తోంది. అదే సమయంలో ఇద్దరు తండ్రీ కొడుకులు ఎడ్ల బండిపై అదే మార్గంలో వెళ్తున్నారు. దాంతో బాధితురాలు వారిని లిఫ్ట్‌ అడిగి.. ఎడ్ల బండి ఎక్కింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత వారిద్దరూ సదరు మహిళను రోడ్డు పక్కకు లాక్కెళ్లి అత్యాచారం చేశారు. 

ఆమె బతికి ఉంటే తమకు ప్రమాదం అని భావించి మహిళ ఒంటికి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయారు. ఆ దారిన వెళ్తున్న స్థానికులు ఆమెను గుర్తించి ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్‌ చేసి సమాచారం అందించారు. బాధితురాలిని సీతాపూర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. 30 శాతం గాయాలు అయ్యాయని ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. బాధితురాలు చెప్పిన సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి.. నిందితులైన తండ్రికొడుకులిద్దరిని అరెస్ట్‌ చేశారు. 
చదవండి: ‘అది ఖచ్చితంగా బ్యాడ్‌ టచే.. నాకు తెలుసు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు