ఆస్పత్రికి శివశంకర్‌ బాబా.. ప్రియ శిష్యురాలి అరెస్టు 

20 Jun, 2021 09:24 IST|Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): విద్యార్థినులపై లైంగిక వేధిపుల కేసులో అరెస్టయిన శివశంకర్‌ బాబా ఆస్పత్రి పాలయ్యాడు. ఆయన స్కూల్లోనే చదువుకుని ప్రియ శిష్యురాలిగా మారిన సుస్మితను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. శివశంకర్‌ బాబాను రిమాండ్‌ నిమిత్తం చెంగల్పట్టు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఆయనకు హఠాత్తుగా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో చెంగల్పట్టు జీహెచ్‌కు తరలించారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాల్సి రావడంతో శనివారం ఉదయాన్నే చెన్నై స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు యాంజియో చికిత్స అందించారు. ఇదిలా ఉండగా బాబా నేతృత్వంలోని సుశీల్‌సూరి స్కూళ్లో చిన్న తనం నుంచి చదువుకుని, అక్కడే స్వామి సేవకు అంకితమైన సుస్మిత అనే ప్రియ శిష్యురాల్ని సీబీసీఐడీ శనివారం అరెస్టు చేసింది.

తన ఆరు నెలల బిడ్డతో పాటు ఆమెను విచారణకు తీసుకెళ్లారు. హాస్టల్‌లో విద్యార్థులకు బ్రెయిన్‌ వాష్‌ చేసి బాబా వద్దకు తీసుకెళ్లడంలో సుస్మిత కీలకంగా వ్యవహరించిన సమాచారంతోనే అరెస్టు చేసినట్టు సీబీసీఐడీ వర్గాలు పేర్కొన్నాయి. కరుణ, నీరజ అనే మరో ఇద్దరు శిష్యురాళ్ల వద్ద విచారణ సాగుతోంది. అలాగే, ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్లలో ఒకరైన భారతీ విదేశాల్లో ఉన్నట్టు, దీప ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించినట్లు విచారణ తేలింది.    

చదవండి: పోలీసుల కళ్లెదుటే వ్యక్తి గుండెల్లో పొడిచి..

మరిన్ని వార్తలు