వివాహేతర సంబంధం, హత్య కేసు.. నిందితుడిని పట్టించిన ‘చెప్పు’

5 Nov, 2021 21:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పుణెలో చోటు చేసుకున్న దారుణం

ముంబై: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. దాదాపు 15 రోజులుగా కేసు చేధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో వారికి దొరికిన  ‘చెప్పు’.. కేసును పరిష్కరించింది.. నిందితులను పట్టించింది. ఈ సంఘటన పుణెలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. 

బవ్ధాన్‌ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి 2021, అక్టోబర్‌ 22 నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో అతడి తల్లి దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాప్‌ సహా పలు యాంగిల్స్‌లో దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో పోలీసులుకు తప్పిపోయిన వ్యక్తి చెప్పు.. ఓ ఇంటి ముందు కనిపించింది. ఆ ఇంట్లో ఉంటున్న వ్యక్తిని స్టేషన్‌కు పిలిపించారు పోలీసులు. 
(చదవండి: ‘నన్ను తక్కువ అంచనా వేశావ్‌’: మృగాడికి చుక్కలు చూపించిన మహిళ)

దర్యాప్తులో పోలీసులకు షాకింగ్‌ విషయాలు తెలిశాయి. తప్పిపోయిన వ్యక్తిని సదరు ఇంటి యమజాని హత్య చేశానని తెలిపాడు. చంపేటంత కోపం ఏంటని ఆరా తీయగా.. హత్య గావించబడిని వ్యక్తికి తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని.. అందుకే అతడిని చంపేశానని తెలిపాడు. అక్టోబర్‌ 21న చనిపోయిన వ్యక్తి మొబైల్‌ నంబర్‌ నుంచి తన భార్యకు రెండు మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయని తెలిపాడు నిందితుడు.
(చదవండి: భూతవైద్యం చేసే మహిళతో ‘సంబంధం’.. ఇటీవల దూరం పెట్టడంతో...)

అంతేకాక అదేరోజు రాత్రి బాధితుడు తన ఇంటికి వచ్చి భార్యను కలిశాడని వెల్లడించాడు. వారి బంధం గురించి తెలిసిన నిందితుడు.. మరో ఇద్దరి సాయంతో బాధితుడిని హత్య చేశాడు. కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తగలబెట్టాడు. ప్రస్తుతం పోలీసులు ఇద్దరిని పుణెలో అరెస్ట్‌ చేయగా.. మరో వ్యక్తిని మధ్యప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. 

చదవండి: తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి.. ఏడాదిగా మరో పరిచయం.. ప్రియుడితో కలిసి

మరిన్ని వార్తలు