ఐదేళ్లుగా ఈ హాస్పిటల్లో రోజూ 37 మం‍ది శిశువుల మృతి.. అసలేం జరుగుతోందక్కడ?

23 Dec, 2021 15:32 IST|Sakshi

Most unsafe hospital భోపాల్‌లోని హమీడియా హాస్పిటల్‌లోని స్పెషల్‌ నియోనాటల్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ)లో గత ఐదేళ్లలో సగటున దాదాపు 37 మంది శిశువులు మృతిచెందారు. దేశంలోని మొత్తం శిశు మరణాలలో 13 శాతం మరణాలు ఈ హాస్పిటల్లోనే చోటుచేసుకుంటున్నాయి. ఎస్‌ఎన్‌సీయూ యూనిట్‌లో ఈ ఏడాది (2020- 21) దాదాపు 5,00,996 నవజాత శిశువులను చేర్చుకోగా, వారిలో 68,301 మంది మరణించారు. 2019-20 మధ్య 14,759 మంది శిశువులు మరణించారు. ఈ యూనిట్‌లో చేరిన చాలా మంది శిశువులు క్రిటికల్‌ కండీషన్‌లో ఉన్నారు. 

డిసెంబర్ 21న (మంగళవారం) రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభ్యుడు జితు పట్వారీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రభురామ్ చౌదరి ఈ డేటాను అందించారు. నెలలు నిండని శిశువులు కూడా హమీడియా ఆసుపత్రిలో చేరారని ఆరోగ్య మంత్రి తెలియజేశారు. ఐతే ఈ శిశువుల ఆరోగ్య భద్రతపై మంత్రి వ్యాఖ్యానించలేదు.

అత్యంత ప్రమాదకర ఆసుపత్రి
ఈ డేటాను పరిశీలిస్తే తెలుస్తోంది మధ్యప్రదేశ్‌లోనే హమీడియా హాస్పిటల్‌ అత్యంత ప్రమాదకర ఆసుపత్రి అని పట్వారీ పేర్కొన్నాడు. ఇది ఆందోళన కలిగించే విషయమని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఆరోగ్య కార్యకర్తలు, ఇతర సిబ్బంది పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉందని పట్వారీ పేర్కొన్నారు. ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశాడు.

కాగా 2018 శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే ప్రకారం అత్యధిక శిశు మరణాల రేటులో మధ్యప్రదేశ్‌ ముందంజలో ఉండటం గమనార్హం. ఇక్కడ ప్రతి వెయ్యి శిశుజననాలకుగాను 48 శిశుమరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో భవనాలు కూలిపోవడం, ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాల వంటివాటివల్లకూడా వందలాది మంది శిశువులు మృతి చెందుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్‌లో భోపాల్‌లోని కమ్లా నెహ్రూ చిల్డ్రన్స్ హాస్పిటల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో గాయపడిన 40 మంది నవజాత శిశువుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, తర్వాత 48 గంటల్లో మరో పది మంది మరణించారు.

చదవండి: Jos Alukkas Jewellery Store: యూట్యూబ్‌లో చూసి రూ.10 కోట్ల విలువైన బంగారం దోపిడీ!

మరిన్ని వార్తలు