ఆర్టీసీ బస్సు ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం 

17 Dec, 2022 09:59 IST|Sakshi

సాక్షి, ఉప్పల్‌: ఉప్పల్‌ వరంగల్‌ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాది కొత్తగూడెం, చెంచుపల్లి గ్రామానికి చెందిన మేకల లిఖిత్‌ నవనీత్‌ (24) పోచారం ఇన్ఫోసిస్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ స్నేహితుడు మచ్చ నవీన్‌తో కలిసి దిల్‌శుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు.

శుక్రవారం ఉదయం వారిరువురు బైక్‌పై హాస్టల్‌ నుంచి పోచారానికి వెళుతుండగా ఉప్పల్‌  ప్రెస్‌ క్లబ్‌ సమీపంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు కిందపడ్డారు. బస్సు  వెనక చక్రాలు లిఖిత్‌ తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు లిఖిత్‌ మృత దేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నవీన్‌ చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరు మేకల రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: పెళ్లికి ముందే బిడ్డకు జన్మనిచ్చిందని దారుణం.. కుటుంబీకులే..!)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు