సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సజీవ దహనం చేసిన అత్తింటివారు

24 Nov, 2020 06:59 IST|Sakshi
మృతుడు పవన్‌కుమార్‌

సాక్షి, జగిత్యాల: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అత్తింటివారు సజీవ దహనం చేశారు. మల్యాల మండలం బల్వంతపూర్‌ శివారులో ఉన్న మంజునాథ ఆలయ గదిలో ఈ దారుణ హత్య జరిగింది. హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన పాగిళ్ల పవన్‌ కుమార్ అనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగికి బల్వంతపూర్‌కు చెందిన కృష్ణవేణితో వివాహమైంది. కృష్ణవేణి సోదరుడు జగన్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా పరామర్శించేందుకు అతని బావ పవన్ వచ్చాడు. గతంలో జగన్ పవన్ కుమార్‌కు మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది.   (సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ప్రేమ.. కొద్ది క్షణాల్లో పెళ్లనగా..)

బావమరిది మృతికి పవన్ కారణమని, మంత్రాలతో చంపించాడనే అనుమానంతో బావమరిది భార్య సుమలత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మృతుడి భార్య ఆరోపిస్తుంది. తనను వాటర్ తెమ్మని బయటికి పంపించి తన భర్తను గదిలో బంధించి పెట్రోలు పోసి నిప్పంటించిందని బోరున విలపిస్తూ కృష్ణవేణి తెలిపారు. జగిత్యాల డీఎస్పీవెంకరమణ, సీఐ కిషోర్‌, ఎస్సై నాగరాజు, శివకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని సజీవ దహనంపై వివరాలు సేకరిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా