రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

19 Mar, 2021 09:18 IST|Sakshi

సాక్షి, ఉప్పల్‌: ఉప్పల్‌ ఏక్‌మినార్‌ మజీద్‌ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు మృతి చెందాడు. ఈ సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ మైబెల్లి తెలిపిన మేరకు.. కుత్బుల్లాపూర్‌ సుచిత్ర ప్రాంతంలో నివాసముండే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తీగూర శివనాగిరెడ్డి (26) ఉప్పల్‌ రోడ్డులోని ఎన్‌ఎస్‌ఎల్‌ భవనంలో  మూడు సంవత్సరాలుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పని చేస్తున్నాడు.

కార్యాలయంలో ఉన్న ల్యాప్‌టాప్‌ కోసం  ఇంటి  నుంచి  తన ద్విచక్ర వాహానం (ఏపి 09 సిఎన్‌ 3009)పై గురువారం ఉదయం బయలు దేరాడు. ఉప్పల్‌ ఏక్‌ మినార్‌ మజీద్‌ వద్ద రాంగ్‌ రూట్‌లో ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాన్‌ వేగంగా ఢీ కొనడంతో తీవ్ర గాయాల పాలైనాడు. గాయపడిన శివనాగిరెడ్డిని చికిత్స నిమిత్తం గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శివనాగిరెడ్డి భార్య తీగూర సుశ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు