దారుణం: భార్య కాపురానికి రావడంలేదని కన్న తండ్రిని..

18 Jun, 2021 08:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఖమ్మం: తండ్రిని కుమారుడు హతమార్చిన సంఘటన ఖమ్మంరూరల్‌ మండలంలోని ఎం.వెంకటాయపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొలిచెలం రామచంద్రయ్య(70)కు ఇద్దరు కుమారులు కృష్ణ, ఉమాశంకర్‌ ఉన్నారు. ఉమాశంకర్‌ భార్యతో గొడవపడటంతో ఆమె నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్య కాపురానికి రాకపోవడానికి తండ్రే కారణమంటూ నిత్యం గొడవ పడుతున్నాడు.

బుధవారం తెల్లవారుమున కూడా ఇదే విషయమై తండ్రి రాంచంద్రయ్యతో తీవ్రంగా ఘర్షణ పడ్డాడు. అడ్డుకోబోయిన తల్లిని కూడా నెట్టివేశాడు. కండువాను తండ్రి మెడకు బిగించి, గొంతు నులిమి, తలను నేలకేసి మోదాడు. అనంతరం పారిపోయాడు. పక్కింటివారు వచ్చి చూసే సరికి రాంచంద్రయ్య తీవ్ర రక్తస్రావమై మృతి చెంది ఉన్నాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని మరో కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎంఏ రవూఫ్‌ తెలిపారు.  

చదవండి: ఫేస్‌బుక్‌ పరిచయం.. బాలికపై ప్రైవేటు టీచర్‌ లైంగికదాడి

మరిన్ని వార్తలు