దారుణం.. పిల్లాడిని కడుపుమాడ్చి చంపిన తల్లి, జీవిత ఖైదు విధించిన కోర్టు.. మిగతా పిల్లలు కూడా!

31 Aug, 2022 11:38 IST|Sakshi

వాషింగ్టన్‌: కన్నబిడ్డను కంటికిరెప్పలా కాపాడుకుంటుంది తల్లి. పిల్లాడు ఎప్పుడైనా ఆకలితో ఏడిస్తే తల్లడిల్లిపోతుంది. కానీ అమెరికాలో ఓ మహిళ చేసిన పని కన్నపేగు బంధానికే కలంకం తెచ్చింది. పసివాడికి సరిగ్గా తిండిపెట్టకుండా ఆకలితో అలమటించేలా చేసింది. ఫలితంగా అతని మరణానికి కారణమైంది.

ఈ ఘటనపై పోలీసులు షీలా ఓ లీరి(38)పై హత్య కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చింది.  శిక్ష ఖరారు మాత్రం నాలుగుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వర్జీనియా కోర్టు ఆమెకు సోమవారం జీవిత ఖైదు విధించింది. ఈ ఆరోపణలతోనే ఈమె భర్త కూడా ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం షీలా కుటుంబసభ్యులంతా శాకాహారులు. కూరగాయలు, పండ్లు మాత్రమే తింటారు. పిల్లలకు తిండి సరిగ్గా పెట్టకపోవడం వల్ల పోషకాహారలోపం బాధితులయ్యారు. ఈ క్రమంలోనే 18 నెలల వీరి కుమారుడు చనిపోయాడు. అతడి బరువు 8 కేజీలు మాత్రమే.  అతడికి తల్లిపాలే ఆహారంగా ఇచ్చేదట షీల. చనిపోయిన  బాబు 18నెలల వయసులో కూడా 7 నెలల చిన్నారి పరిమాణంలో ఉన్నాడని అధికారులు పేర్కొన్నారు. వీరికి ముడేళ్లు, ఐదేళ్ల వయసున్న మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
చదవండి: సోవియట్ యూనియన్‌ చివరి అధ్యక్షుడు కన్నుమూత

మరిన్ని వార్తలు