పక్క పక్క పోర్షన్లు.. అత్తపై అల్లుడి దాడి.. కారణం ఏమిటంటే?

9 Jan, 2023 14:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): భార్యాభర్తల గొడవ నేపథ్యంలో అడ్డువెళ్లిన అత్తను ఊచతో అల్లుడు దాడిచేసి గాయపరిచిన సంఘటన నారాయణపురంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపురానికి చెందిన నరుకుర్తి కాంతం, కుమార్తె దుర్గావేణి, అల్లుడు నారాయణ ఒకే ఇంటిలో పక్క పక్క పోర్షన్లలో నివసిస్తున్నారు.

అయితే శనివారం నారాయణ, దుర్గావేణి గొడవ పడుతుండగా పక్కనే ఉన్న కాంతం వారి మధ్యకు వెళ్లింది. దీంతో కోపోద్రిక్తుడైన అల్లుడు నారాయణ.. కాంతంపై ఇనుపఊచతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె పొట్టపై గాయాలు కావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాంతం ఫిర్యాదు మేరకు ప్రకాశం నగర్‌ ఎస్సై ప్రేమరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: వివాహితతో సహజీవనం.. కుమార్తెలపై కన్నేసి..    

మరిన్ని వార్తలు