ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..!

12 Oct, 2021 18:31 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న డీఎస్పీ సుభాష్‌

పార్వతీపురం టౌన్‌(విజయనగరం జిల్లా): కొమరాడ మండలకేంద్రంలో వారంరోజుల కిందట జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. సొంత అత్త ఇంట్లో అల్లుడే దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. దొంగతనం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు పార్వతీపురం డీఎస్పీ సుభాష్‌ తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. (చదవండి: కాసుల కోసం కక్కుర్తి..! వాట్సాప్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌..!

కొమరాడ మండలానికి చెందిన ఓ ఇంటికి ఆవాల గణేష్‌ ఇల్లరికానికి వచ్చి ఉంటున్నాడని పేర్కొరు. అడిగినపుడు అత్త డబ్బులు ఇవ్వడం లేదని, రెండురోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన అన్నదమ్ముడు కుమారుడైన సింహాచలంతో కలసి దొంగతనం చేశాడని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇద్దరు నిందితుల వద్ద నుంచి ఎనిమిది తులాల బంగారం, రూ.20వేల నగదును స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని తెలిపారు. కార్యక్రమంలో సీఐ విజయ్‌ఆనంద్, ఎస్సై ప్రయాగమూర్తి పాల్గొన్నారు.
చదవండి:
అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నిర్వాకం

మరిన్ని వార్తలు