శ్రావణి కేసు: వెలుగులోకి కొత్త విషయాలు

17 Sep, 2020 21:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసుకు సంబంధించి అశోక్‌రెడ్డి అరెస్టుతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అశోక్‌ రెడ్డి శ్రావణిని విపరీతంగా వేధింపులకు గురి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంకా ఆ విచారణలో.. ‘‘ 2017 నుంచి శ్రావణితో అతడికి పరిచయం ఉంది. అశోక్‌రెడ్డి తీసిన ఆర్‌ఎక్స్‌ 100లో ఆమెకు గెస్ట్‌ రోల్ ఇచ్చాడు. శ్రావణిని అన్ని విధాలుగా వాడుకున్నాడు. ఆమె ఆర్థిక పరిస్థితి అడ్డం పెట్టుకుని వేధింపులకు గురిచేశాడు.శ్రావణికి పలుమార్లు ఆర్థికసాయం చేసిన అశోక్‌రెడ్డి ఆర్థిక సాయం నెపంతో ఆమెపై జులుం చేశాడు. తనను కాదని ఎవరిని వివాహం చేసుకోవద్దని బెదిరింపులకు దిగాడు. శ్రావణి చనిపోయిన రోజున కూడా ఆమె ఇంటికొచ్చి, కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోనే బెదిరింపులకు పాల్పడ్డాడు. ( శ్రావణి కేసు: ట్విస్ట్‌ ఇచ్చిన పోలీసులు! )

అదే సమయంలో శ్రావణి ఇంటికొచ్చిన సాయి, అశోక్‌రెడ్డితో కలిసి ఆమెను టార్చర్ చేశాడు. ఇద్దరి వేధింపులను శ్రావణి దేవరాజ్‌తో పంచుకుంది. ఈ నేపథ్యంలో సాయి, అశోక్‌రెడ్డిలను దూరం చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని దేవరాజ్‌ చెప్పాడు. అయితే ఆ తర్వాత నుంచి శ్రావణిని దూరం పెడుతూ వచ్చాడు. దీంతో ముగ్గురి వేధింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుంద’’ని వెల్లడైంది.

మరిన్ని వార్తలు