సీఐ మురళీకృష్ణపై నటి శ్రీసుధ ఫిర్యాదు

29 Jul, 2020 14:01 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: ఎస్ఆర్ న‌గ‌ర్ సీఐ ముర‌ళీకృష్ణ త‌న ద‌గ్గ‌ర లంచం తీసుకున్నారంటూ న‌టి శ్రీసుధ ఏసీబీ(అవినీతి నిరోధ‌క శాఖ‌)కు ఫిర్యాదు చేశారు. కాగా ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కే నాయుడు త‌మ్ముడు శ్యామ్ కే.నాయుడు త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని మోసం చేశాడ‌ని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నటి సాయి సుధ గ‌తంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు ద‌ర్యాప్తు కోసం సీఐ ముర‌ళీకృష్ణ త‌న ద‌గ్గ‌ర‌ డ‌బ్బులు వ‌సూలు చేశా‌రని ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక‌ ఈ కేసులో శ్యామ్ కే నాయుడు త‌న‌తో రాజీ కుదుర్చుకున్న‌ట్లు న‌కిలీ ప‌త్రాలు సృ‌ష్టించార‌ని ఆరోపించారు. ఈ మేర‌కు నాంప‌ల్లిలోని ఏసీబీ అధికారుల‌కు ఆధారాలు స‌మ‌ర్పించారు.  (పెళ్లి పేరుతో మోసం చేశాడు)

చ‌ద‌వండి: (సుశాంత్‌ తండ్రి ఫిర్యాదు.. రియాపై కేసు)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు