టీడీపీ నేత నుంచి ప్రాణహాని: శ్రీధర్‌

16 Oct, 2021 15:58 IST|Sakshi
 టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

సాక్షి, తిరుపతి: టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ నుంచి తనకు ప్రాణ ముప్పు ఉందని ఎన్‌ఆర్‌ఐ విద్యాసంస్థల తాజా మాజీ సీఈవో శ్రీధర్‌ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్‌ఆర్‌ఐ విద్యాసంస్థల సీఈవోగా రాజీనామా చేసి బయటకు వచ్చానని తెలిపారు. వచ్చిన లాభాల్లో 5 శాతం వాటా ఇస్తామని తానను మోసం చేశారన్నారు. కోవిడ్‌ సమయంలో ఫీజులు తగ్గించమని చెప్పినా పూర్తిగా వసూలు చేశారని.. తనపై ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. తనకేదైనా జరిగితే టీడీపీ నేత ఆలపాటిదే బాధ్యత అని శ్రీధర్‌ స్పష్టం చేశారు.

చదవండి: రెడ్‌ మీ నోట్‌11 సిరీస్‌ ఫోన్‌ ఫీచర్లు లీక్‌, లుక్ అదిరిపోయింది..! 

మరిన్ని వార్తలు