మిస్టరీ వీడింది.. మద్యం మత్తులో సొంత మేనల్లుడే..

26 Aug, 2021 10:32 IST|Sakshi
హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రావణి, సీఐ శంకరరావులు

సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం): మద్యం మత్తు నిండు ప్రాణాన్ని బలికొంది. సొంత మేనమామను హత్య చేసేలా మేనల్లుడిని ఉసిగొల్పింది. ఇద్దరి మధ్య జరిగిన చిన్న తగాదా ప్రాణం తీసేస్థాయికి చేరింది. కర్రతో కొట్టి ఆపై పంట పొలంలోకి ఈడ్చుకువెళ్లి తలను బురదలోకి తొక్కేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరఘట్టం మండలంలోని సీఎస్పీ రహదారిలో చిట్టపులివలస జంక్షన్‌–విక్రమపురం గ్రామాల మధ్య పొలాల్లో ఈ నెల 23న దొరికిన గుర్తు తెలి యని వ్యక్తి మృతదేహం వెనుక మిస్టరీ వీడింది.

బుధవారం పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐ జి.శంకరరావులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం కేసు వివరాలను వెల్లడించారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం ల చ్చయ్యపేట గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్‌ బత్తు ల పోలినాయుడు(38), వీరఘట్టం మండలం విక్ర మపురం గ్రామానికి చెందిన అతని మేనల్లుడు(మైనర్‌) రేగిడి మండలం ఉంగరాడమెట్ట వద్ద బంధు వుల ఇంటిలో జరిగిన పెళ్లికి ఈ నెల 22న వెళ్లారు. అక్కడి నుంచి అదే రోజు రాత్రి బయల్దేరి వీరఘట్టంలో దిగి మందు తాగారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో నడుచుకుంటూ విక్రమపురం గ్రామానికి బయల్దేరారు.

దారిలో ఇద్దరి మధ్య జరిగిన చి న్న గొడవ కొట్లాటకు దారి తీసింది. దీంతో మేన ల్లుడు అతడి మామ పోలినాయుడును కర్రతో బ లంగా కొట్టి, ఆపై పక్కనే ఉన్న పంట పొలంలో తలను తొక్కేయడంతో చనిపోయాడని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులోనే ఈ హత్య జరిగింద ని, వీరిద్దరి మధ్య పాత కక్షలు లాంటివి ఏవీ లేవని పేర్కొన్నారు. హంతకుడిని అదుపులోకి తీసుకున్నామని, విశాఖపట్నం బాల నేరస్తుల కేంద్రానికి అప్ప గిస్తామని డీఎస్పీ శ్రావణి తెలిపారు. ]

చదవండి: Work From Home: తెగ నవ్వులు తెప్పిస్తున్న వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఫొటో

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు