తల్లిదండ్రులకు కడుపు కోత.. ప్రాణాలు తీసిన ప్రేమ

20 Jul, 2021 09:33 IST|Sakshi

సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్‌( శ్రీకాకుళం): ప్రేమ విషాదాంతమైంది. తల్లిదండ్రులకు కడుపు కోతమిగిల్చింది. చదవుకోవల్సిన వయసులో ప్రేమ కోసం బలవణ్మరణాకి పాల్పడ్డారు. ఈ నెల 15వ తేదీన బడివానిపేట పంచాయతీ మోసవానిపేటకు చెందిన 19 ఏళ్ల యువకుడు మారుపల్లి గణేష్‌ పురుగు మందుతాగగా.. తల్లిదండ్రులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ 17వ తేదీన మృతి చెందాడు. గణేష్‌ శ్రీకాకుళంలోని ప్రైవే ట్‌ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు.

ఆత్మహత్యపై ఎచ్చెర్ల పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తు న్నారు. గ్రామంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇంతలోనే కొయ్యాం పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఆదివారం రాత్రి చెట్లను కట్‌ చేసే యంత్రపు రంపంతో మెడ కోసు కొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులు రహస్యంగా ఉంచారు. పోలీసులకు ఎటువంటి సమాచారం చేరకుండా జాగ్రత్త పడ్డారు. అయితే కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం రావడంతో చర్చనీయంశమైంది.

పురుగు మందు తాగి చనిపోయిన యువకుడు, రంపంతో పీక కోసుకొని ప్రాణాలు తీసుకున్న బాలిక మధ్య ప్రేమ వ్యవహారం కొద్దిరోజులుగా నడుస్తుందంటున్నారు. బాలిక కూడా ఇంటర్‌ పాసై డిగ్రీలో చేరే ప్రయత్నంలో ఉంది. అయితే కులాలు వేరు కావడం, మైనర్లు కావడంతో వారి కుటుంబాలు వీరి ప్రేమను వ్యతిరేకించినట్టు తెలిసింది. దీంతో కలిసి బతకలేని జీవితం ఎందుకంటూ ముందు యువకుడు చనిపోగా.. ఈ విషయం తెలిసి రెండో రోజు బాలిక ప్రాణం తీసుకున్నట్టు ఆయా గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు