శ్రీకాళహస్తి ఫిన్‌కేర్‌ బ్యాంక్‌ దోపిడి కేసులో కొత్త కోణం

1 Jun, 2022 15:05 IST|Sakshi

సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి ఫిన్‌కేర్‌ బ్యాంక్‌ దోపిడి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బ్యాంకు మేనేజర్‌ స్రవంతిని పోలీసులు విచారించగా వెలుగులోకి ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. ఫిన్‌ కేర్‌ బ్యాంకులో కస్టమర్లు తాకట్టు పెట్టిన కిలోకు పైగా బంగారాన్ని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి క్యాష్‌ చేస్తుకుంది మేనేజర్‌ స్రవంతి. ఈ వ్యవహారమంతా వేరే వ్యక్తుల పేర్లతో నడపింది. ఎవరీ అనుమానం రాకుండా బయట వ్యక్తులతో బేరం కుదర్చుకని ఫిన్‌కేర్‌ కస్టమర్ల బంగారాన్ని మూత్తూట్‌లో తాకట్టు పెట్టింది.  కానీ బ్యాంక్‌ ఉన్నతాధికారుల ఫిర్యాదులో నిజాలు వెలుగులోకి మేనేజర్‌ స్రవంతి నిర్వాకం బయటపడింది.

కాగా.. బ్యాంకులో దొంగలు పడి దోచుకెళ్లారని ఖాతాదారులను, పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసిన మేనజర్‌ స్రవంతి అడ్డంగా దొరికిపోయింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు బ్యాంక్‌కు కన్నం వేసినట్లు స్రవంతి తెలిపింది. మేనేజర్‌ నుంచి దోపిడి సొత్తు రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా స్రవంతి గత నాలుగేళ్లుగా ఫిన్‌కేర్‌ బ్యాంక్‌లో బ్రాంచ్‌ మేనేజర్‌గా అప్రైజర్‌గా కొనసాగుతోంది.\

చదవండి: ఇంటర్‌ స్టూడెంట్‌ పాడుపని.. బాలికను ఇంటికి తీసుకెళ్లి..

>
మరిన్ని వార్తలు