ఔషధ చట్టం ఉల్లంఘిస్తే జైలుకే’

29 Apr, 2022 10:54 IST|Sakshi

అరసవల్లి: జిల్లాలో అనధికారికంగా మందులు నిల్వ చేసే వారికి జైలు శిక్ష తప్పదని ఔషధ ని యంత్రణ శాఖ సహాయ సంచాలకులు ఎం. చంద్రరావు హెచ్చరించారు. ఆయన గురు వారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తాజాగా టెక్కలి పరిధిలో ఔషధ చట్టం (1940) నిబంధనలు అతిక్రమించినందుకు బగాది కూర్మినాయకులు అనే వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానాను టెక్కలి అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు విధించిందని గుర్తు చేశారు.

2018లో లైసెన్సు లేకుండా మందులు నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నారన్న సమాచారంతో అప్పట్లో టెక్కలి, శ్రీకాకుళం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు లావణ్య, కళ్యాణి బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కూర్మినాయుడుపై కేసు నమోదు చేశారని వివరించారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి అక్రమాలు, నిల్వలున్న వ్యాపారులపై కఠిన చర్య లు తప్పవని ఆయన హెచ్చరించారు.

(చదవండి: ప్రశ్నపత్రం లీకేజీ అంటూ తప్పుడు ప్రచారం)

మరిన్ని వార్తలు