వెంటాడుతున్న కుక్కలు.. జనగామలో ఒకేరోజు 21 మందికి గాయాలు

20 Mar, 2023 09:48 IST|Sakshi

జనగామ: వీధి కుక్కల స్వైరవిహారంతో పలు ప్రాంతాల్లో 23మంది తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా కేంద్రంలోనే ఏకంగా 21 మంది వీధి కుక్కల బారిన పడి గాయాలపాలయ్యారు. కుర్మవాడ(సుమారు 4 వార్డుల పరిధి), హనుమాన్‌ స్ట్రీట్‌ తదితర ప్రాంతాలకు చెందిన స్థానికులు రోడ్డుపై వెళ్తుండగా కుక్కలు దాడి చేశాయి. సమీప వాసులు కర్రలు, రాళ్లతో తరిమికొట్టడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

వెంటనే బాధితులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కుక్క కాటుకు సంబంధించిన ఇంజక్షన్‌ తీసుకుని చికిత్స పొందారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట పద్మానగర్‌కు చెందిన పదేళ్ల బాలుడు మహ్మద్‌ అర్స్‌లాన్‌ రోడ్డుపై ఆడుకుంటుండగా కుక్క కరవడంతో చేతికి గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఇక హనుమకొండ జిల్లా కాజీపేటలో స్కూలుకు వెళ్లి వస్తున్న తొమ్మిదేళ్ల బాలుడు ముస్త ఫాను స్థానిక శైలేందర్‌ సింగ్‌కు చెందిన పెంపుడు కుక్క కరిచింది. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో కుక్క యజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: విషాదం.. కొడుకు పుట్టినరోజే.. తండ్రి ఆత్మహత్య..

మరిన్ని వార్తలు