సరిగా కూర్చోవాలని అన్నందుకు ఐరన్‌ రాడ్‌తో టీచర్‌పై..

20 Sep, 2021 13:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ: తరగతి గదిలో విద్యార్థులు సరిగా కూర్చుకోకుండా ఉంటే టీచర్లు సరిగా కూర్చోవాలని కోరుతుంటారు. అయితే సాధారణంగా విద్యార్థులు టీచర్లు చెప్పడంతో సర్దుకొని కూర్చుకొని శ్రద్ధగా పాఠాలు వింటారు. అయితే ఓ విద్యార్థి సరిగా కూర్చోవాలని అన్నందుకు టీచర్‌పైనే దాడి చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో చదువుతున్న లతీఫ్‌ అనే విద్యార్థి ఇప్పటికే రెండు సార్లు పరీక్షల్లో తప్పటం వల్ల ఇంటర్‌ మొదటి ఏడాదిలోనే కొనసాగుతున్నాడు.

చదవండి: అమృత్ సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

అయితే టీచర్‌ తరగతిగదిలో పాఠం చెబుతున్న సమయంలో ఇష్టం వచ్చినట్లు కూర్చుని ఉన్నాడు. అయితే అది గమనించిన టీచర్ అతన్ని సరిగా కూర్చోవాలని కోరాడు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన లతీఫ్‌ ఐరన్‌ రాడ్‌తో టీచర్‌పై దాడి చేశాడు. అనంతరం టీచర్‌ స్థానిక పోలీసు స్టేషన్‌లో లతీష్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న​ పోలీసుల ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు