Tamil Nadu: విద్యార్థుల గ్రూపు వివాదాలు.. ఏకంగా కత్తులతో..

17 May, 2022 07:53 IST|Sakshi

సాక్షి, చెన్నై: విద్యార్థులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గ్రూపు వివాదాలతో తన్నుకుంటున్నారు. చెన్నైలో సోమవారం ఓ కళాశాల వద్ద ఏకంగా కత్తులతో విద్యార్థులు వీరంగం సృష్టించడం ప్రజల్ని ఆందోళనలో పడేసింది. ఇటీవలి కాలంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు బహిరంగ ప్రదేశాల్లో వ్యవహరిస్తున్న తీరు చర్చకుదారి తీసిన విషయం తెలిసిందే. విద్యార్థులకు ఏ మాత్రం తీసి పోమని చాటే విధంగా విద్యార్థినులు సైతం తన్నకుంటున్నారు. ఈ పరిణామాల్ని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ పాఠాలపై దృష్టి పెట్టారు.

అయినా, తాము ఏ మాత్రం తగ్గమన్నట్టుగా వ్యహరించే విద్యార్థులు ఎక్కువగానే ఉన్నారు. చెన్నైలోని పచ్చయప్ప కళాశాల విద్యార్థుల గ్రూపు విభేదాలు సోమవారం రోడ్డెక్కాయి. కీల్పాకం సమీపంలో విద్యార్థులు కత్తులతో వీరంగం సృష్టించారు. పరస్పరం దాడులకు దిగడంతో ఆ పరిసర ప్రాంత వాసులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది కత్తులను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. అలాగే, సైదా పేట సమీపంలో మరో విద్యారి్థి గ్రూపు బస్సులో వీరంగం సృష్టించింది. కండెక్టర్‌పై దాడికి యత్నించడంతో రవాణా కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కాసేపు బస్సులు ఆగాయి. ఆ విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక, కృష్ణగిరి జిల్లా కావేరి పట్నంలోఅయితే, పదో తరగతి విద్యార్థిపై సహచర విద్యార్థులు కత్తులతో దాడి చేయడం కలకలం రేపింది.

చదవండి: వివస్త్రను చేసి.. కళ్లల్లో, నోట్లో హిట్‌ కొట్టి...

మరిన్ని వార్తలు