పరీక్షల్లో ఫెయిలవ్వొద్దు అన్నందుకు తండ్రి హత్య! ట్విస్ట్‌ ఏంటంటే?

7 Apr, 2022 10:53 IST|Sakshi

Scared of rebuke for failing exams: తల్లిదండ్రులు మందలించారనో లేకు తాము అడిగింది కొనివ్వటం లేదనో కన్న తల్లిదండ్రుల పై కక్ష సాధించే ప్రబుద్ధులను చూస్తూనే ఉన్నాం. అంతెందుకు దురాలవట్లకు బానిసై చెడు మార్గంలో పయనిస్తున్న పిల్లలను సరైన మార్గంలో పెట్టే నిమిత్తం కాస్త కఠినంగా వ్యవహరించినందుకే తల్లిదం‍డ్రులనే హతమార్చే కిరాతక పిల్లల గురించి విన్నాం. అచ్చం అలానే మధ్యప్రదేశ్‌లోని ఒక బాలుడు దారుణమైన నేరానికి  ఒడిగట్టాడు.

వివరాల్లోకెళ్తే...
మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థిని అతని తండ్రి పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇంటి నుంచి గెంటేస్తానని వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో ఆ విద్యార్థి తాను పరీక్షల్లో ఫెయిల్‌ అయితే కచ్చితంగా ఇంటి నుంచి గెంటేయడం ఖాయం అన్న భయంతో తండ్రిని గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ బాలుడు నేరం చేయడమే కాకుండా ఈ హత్య నేరంలో తమ పక్కంటివాళ్లను ఇరికించేందుకు యత్నించాడు. అంతేకాదు తమ పక్కింటివాళ్లే తన తండ్రిని చంపారని, తాను చూశానని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.

అయితే ఫోరెన్సిక్‌ విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు బాలుడిని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించడు. ఫైనల్‌ పరీక్షలు సరిగ్గా చదవలేదని అందువల్ల ఫెయిల్‌ అవుతానని భయపడ్డానని ఆ బాలుడు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రాజీవ్ మిశ్రా ఆ బాలుడు తన తండ్రి నిద్రిస్తున్న​ సమయంలో గొడ్డలితో చంపాడని తెలిపారు. ప్రస్తుతం  ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు.

(చదవండి: జైలు నుంచి విడుదలై బాలిక కోసం గాలింపు.. ఇంట్లో తెలియడంతో..)

మరిన్ని వార్తలు