సెల్ ఫోన్ కోసం .. ప్రాణం తీసుకున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థి

28 Jul, 2021 21:10 IST|Sakshi

సాక్షి,అనంతపురం(కుందుర్పి): సెల్‌ఫోన్‌ ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన నగేష్‌ కుమారుడు అజిత్‌ (17) ఇంటర్మీడియట్‌ చదువుకుంటున్నాడు. కోవిడ్‌ నేపథ్యంలో కళాశాల తెరవకపోవడంతో పుస్తకాలు పక్కన పెట్టేసి సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడేందుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయమే సెల్‌ఫోన్‌ తీసుకుని ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో తండ్రి మందలించాడు. చదువులపై దృష్టి పెట్టాలంటూ హితవు పలికారు. దీంతో మనస్థాపం చెందిన అజిత్‌.. గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ గణేష్‌ తెలిపారు.    

మరిన్ని వార్తలు