ఘోర రోడ్డు ప్రమాదం: సీఐ దంపతుల దుర్మరణం

9 May, 2021 03:31 IST|Sakshi
కుమారుడు, కూతురుతో లక్ష్మణ్‌ దంపతులు (ఫైల్‌)
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలో ఘటన 

సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ, ఆయన భార్య మృతి చెందారు. నగరంలోని సుల్తాన్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సుందరి లక్ష్మణ్‌ (39) కొత్తపేటలో నివాసముంటున్నారు. లక్ష్మణ్‌ రెండు రోజులక్రితం తన భార్య ఝాన్సీ(34), కుమారుడు సాహస, కూతురు ఆకాంక్షతో కలసి సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం నాగులపాటి అన్నారం గ్రామంలోని ఝాన్సీ పుట్టింటికి వెళ్లారు.

కూతురు ఆకాంక్షను ఝాన్సీ తల్లిదండ్రుల వద్ద వదిలి శుక్రవారం రాత్రి తమ స్విఫ్ట్‌ కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. కారును ఝాన్సీ నడుపుతుండగా లక్ష్మణ్‌ ముందు సీటులో, కుమారుడు సాహస వెనక సీటులో కూర్చున్నారు. అర్ధరాత్రి  వీరు ప్రయాణిస్తున్న కారు అబ్దుల్లాపూర్‌మెట్‌ శివారులోని ఇనాంగూడ గేట్‌ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన లక్ష్మణ్, ఝాన్సీ కారులోనే మృతిచెందగా, సాహసకు స్వల్పగాయాలయ్యాయి.   ‘మా అమ్మనాన్నలను కాపాడండి’ అంటూ సాహస ఏడుస్తూ రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపే ప్రయత్నం చేశాడని స్థానికులు తెలిపారు.  మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలిచారు. 

చదవండి:  (దారుణం: పెళ్లికి నిరాకరించిందని..)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు