సూరీడుపై హత్యాయత్నం

25 Mar, 2021 03:35 IST|Sakshi

దాడికి పాల్పడిన అల్లుడి అరెస్ట్‌

సాక్షి, బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): తన తల్లిదండ్రులపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ సూరీడు కుమార్తె గంగాభవానీ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీంతో పోలీసులు బుధవారం సూరీడు అల్లుడు డాక్టర్‌ సురేంద్రనాథ్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు.

జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీ హిల్స్‌ రోడ్‌ నంబరు 10లోని గాయత్రీహిల్స్‌లో నివసించే ఇ. సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరీడు కుమార్తె గంగాభవాని, డాక్టర్‌ సురేంద్రనాథ్‌రెడ్డి భార్యాభర్తలు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి సురేంద్రనాథ్‌రెడ్డి తన మామ ఇంట్లోకి ప్రవేశించి, కర్రబ్యాటుతో సూరీడుపై వెనుక నుంచి దాడి చేశాడు. అడ్డు వచ్చిన అత్తపై కూడా దాడి చేశాడు. ఘటనలో గంగాభవానీకి కూడా గాయాలయ్యాయి. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  సురేంద్రనాథ్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. గంగాభవానీ ఫిర్యాదు మేరకు సురేంద్రపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. 

చదవండి: (బీఫార్మసీ విద్యార్థిని సుప్రియ ఆత్మహత్య)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు