రాజ్‌పుత్‌ది హత్యే..!

26 Sep, 2020 02:38 IST|Sakshi

న్యూఢిల్లీ:   గొంతు నులమడం వల్లనే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయాడని సుశాంత్‌ ఫ్యామిలీ లాయర్‌ వికాస్‌ సింగ్‌  ఆరోపించారు. తాను పంపిన సుశాంత్‌ మృతదేహం ఫొటోలు చూసి ఎయిమ్స్‌ సీనియర్‌ డాక్టర్‌ ఒకరు ఈ విషయం స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ చేస్తున్న జాప్యం దారుణమన్నారు. సుశాంత్‌ అనుమానాస్పద మృతిపై దర్యాప్తును పక్కనబెట్టి, ఎన్సీబీ డ్రగ్స్‌ కేసుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారన్నారు. జూన్‌ 14న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్‌ ఉరివేసుకుని చనిపోయి కనిపించారు. ఈ మృతికి కారణమంటూ రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసు పలు మలుపులు తిరుగుతూ బాలీవుడ్‌– డ్రగ్స్‌ సంబంధాలపైవిచారణ వరకు వచ్చింది.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు