Sushil Kumar‌: జైల్లో ఇచ్చే ప్రోటీన్‌ సరిపోదు!

9 Jun, 2021 10:03 IST|Sakshi

న్యూఢిల్లీ: జైలులో ఇచ్చే ఆహారంలోని పోట్రీన్‌ తనకు సరిపోవని.. కాబట్టి ప్రోటీన్‌ షేక్‌, వ్యాయామ సామాగ్రి  కావాలని రెజ్లర్‌ సుశీల్ కుమార్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. రాబోయే టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నందున ప్రోటీన్ సప్లిమెంట్స్, వ్యాయామ సామాగ్రి, ప్రత్యేక ఆహారం అందించాల్సిందిగా  ఆయన కోర్టును కోరారు. ప్రత్యేక ఆహారం కింద ఒమేగా 3 క్యాప్సూల్స్, ప్రీ-వర్కౌట్ సప్లిమెంట్స్, మల్టీవిటమిన్ మాత్రలు కావాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా సుశీల్ కుమార్ పిటిషణ్‌పై బుధవారం కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

ఇక సాధారణంగా జైల్లో ఐదు రోటీలు, ఏదైనా కూరగాయలతో చేసిన రెండు కర్రీలు, పప్పు, అన్నం ఇస్తారు. అంతేకాకుండా క్యాంటీన్‌లో నెలకు రూ. 6,000 వరకు కొనుక్కుని తినవచ్చు. అయితే సుశీల్‌ కుమార్‌ రెజ్లర్‌ కావడంతో మరింత ప్రోటీన్స్‌ అవసరమని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇక ఛత్రసాల్ స్టేడియం వద్ద యువ రెజ్లర్ సాగర్ ధనకర్ హత్యకు సంబంధించి మే 23న ఢిల్లీ పోలీసులు సుశీల్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. సుశీల్‌ను ఢిల్లీలోని మాండోలి జైలులో ప్రత్యేక సెల్‌లో ఉంచారు. అంతేకాకుండా భద్రతా కారణాల దృష్ట్యా అతన్ని కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు.

మరిన్ని వార్తలు