హాస్టల్‌ పైనుంచి దూకి బీటెక్‌ స్టూడెంట్‌ మృతి, వీడియో వైరల్‌

23 Mar, 2021 10:32 IST|Sakshi

హాస్టల్‌ పైనుంచి దూకినట్లు అనుమానం

చదువులో వెనకబడ్డానన్న మనస్తాపంతో ఆత్మహత్య!

సాక్షి, మేడ్చల్‌ : మేడ్చల్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పేట్‌ బషీరాబాద్‌లోచంద్రిక అనే ఇంజనీరింగ్‌ విద్యార్ధి అనుమానాస్పదంగా మృతి చెందింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో యువతి నాలుగో సంవత్సరం చదువుతోంది. చంద్రిక స్వస్థలం మిర్యాలగూడ. కాగా ప్రస్తుతం మైసమ్మగూడలోని కృప వసతి గృహంలో ఉంటోంది. హాస్టల్‌ భవనం పైనుంచి దూకి చంద్రిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా యువతి చంద్రిక ఘటనకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటనపై డీసీపీ పద్మజ మాట్లాడుతూ..'కృప హాస్టల్‌ పక్కన యువతి మృతదేహాం ఉందని మంగళవారం ఉదయం 8.15 కి స్థానిక కౌన్సిలర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. యువతిని మిర్యాలగూడకు చెందని చం‍ద్రికగా గుర్తించాం. ఆమెకు బాక్‌ల్యాగ్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా తర్వాత ఇటీవల సీటీకి వచ్చిన చంద్రిక ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతుంది. చదువులో వెనకబడి ఉన్నానన్న మసస్తాపంతో యువతి బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. అనుమానస్పద మృతి కేసు నమోదు చేసుకున్నాం. సీసీ కెమెరాలు, చంద్రిక ఫోన్ డేటా పరిశీలిస్తున్నాం'అని ఆమె పేర్కొన్నారు.

చదవండి : పెద్దలకు ఇష్టం లేకపోయినా ప్రేమ పెళ్లి.. నాలుగు నెలల్లోనే...
వయసు 26.. కేసులు 20 

మరిన్ని వార్తలు