ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద మృతి

19 Dec, 2020 15:49 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలోని వాంబే కాలనీలో ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో డాన్సర్ గాయత్రి  ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు ముందు నీలిమ అనే యువతి ఇంటి కొచ్చినట్లు సమాచారం. ఇద్దరి మధ్య ఇంట్లో వివాదం జరిగినట్లు తెలిసింది.(చదవండి: భార్యతో కలిసి అత్తమామల ఉసురు తీశాడు)

నీలిమ వెళ్లిపోయిన తర్వాత  గాయత్రి.. ఇంట్లో చీరతో ఉరివేసుకుంది. ఆ సమయంలో పిల్లలతో కలిసి గాయత్రి భర్త సతీష్‌ బయటకు వెళ్లారు. గాయత్రి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రితో గొడవ పడిన నీలిమాని పోలీసులు విచారిస్తున్నారు. (చదవండి: టీడీపీ మాజీ ఎంపీ.. రాయపాటిపై సీబీఐ దాడులు)

మరిన్ని వార్తలు