భక్తురాలిపై అఘాయిత్యం... దేవతే అలా చేసిందని బుకాయింపు

9 Aug, 2022 17:52 IST|Sakshi

ఇటీవల కాలంలో స్వామిజీ పేరుతో భక్తులపై అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు. అయినా ప్రజల్లో కూడా మార్పు రావడం లేదు. ఈ డిజిటల్‌ యుగంలో పిచ్చి బాబాలు, స్వామీజీల మాయలో పడి కోరి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ స్వామీజీని నమ్మీ జీవితాన్ని నాశనం చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మధ్యప్రధేశ్‌లో ఒక వ్యక్తి తనను దేవుడిగా ప్రకటించుకుని స్వామి వైర్యాగ్యనంద గిరిగా పబ్లిక్‌లో చెలామణి అవుతున్నాడు. ఈ మేరకు ఒక మహిళ తనకు చాలా ఏళ్లుగా పిల్లలు కలగకపోవడంతో ఈ వైర్యాగ్యనంద స్వామిని కలిసినట్లు పోలీసులుకు తెలిపింది. కొన్ని పూజలు చేస్తే పిల్లలు కలుగుతారని నమ్మబలికి ఒక ప్రసాదం ఇచ్చాడని చెప్పింది. సదరు మహిళ ఆ ప్రసాదం తిని స్ప్రుహ కోల్పోయాననని, ఆ తర్వాత ఆ వ్యక్తి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చింది.

ఐతే తనకు మెలుకువ వచ్చిన తర్వాత ఆ వైరాగ్యానంద స్వామీ.. దేవత నీపై అత్యాచారం చేసిందని చెబుతున్నాడని వాపోయింది. ఆ బాధిత మహిళ వెంటనే ఆ స్వామీజీ పై ఫిర్యాదు చేయలేకపోయింది. ఎందుకంటే ఆ స్వామిజీకి రాజకీయ పార్టీల అండదండ ఉంది. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి మద్దతుగా నిలబడటమే కాకుండా ఒక సీనియర్‌ నాయకుడి గెలుపు కోసం యజ్ఞం చేశాడు. పైగా అతను గెలవకపోతే సమాదిలోకి వెళ్లిపోతానంటూ ప్రగల్పాలు కూడా పలికాడు. ఆ వ్యక్తికి సమాజంలో కాస్త పలుకుబడి ఉండడంతో భయప్డడానని చెప్పుకొచ్చింది సదరు బాధితరాలు. ఈ మేరకు పోలీసులు అతని పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 

(చదవండి: లాలు యాదవ్‌ కుమార్తె ట్వీట్‌... బలపడనున్న 'గత బంధం')

మరిన్ని వార్తలు