జూబ్లీహిల్స్‌లో దారుణం: చంపి ఫ్రిజ్‌లో పెట్టారు

1 Apr, 2021 18:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. దుండగులు ఓ వ్యక్తిని హత్య చేసి ఫ్రిజ్‌లో దాచి పెట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. మహమ్మద్ సిద్ధిక్ (35) అనే వ్యక్తి కార్మిక నగర్‌లోని ఓ భవంతిలో టైలరింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో దుండగులు సిద్ధిక్‌ని దారుణంగా హత్య చేసి అతడి ఇంటిలోని ఫ్రిజ్‌లో దాచి పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.

చదవండి: జూబ్లీహిల్స్‌: ఇంటికి పిలిచి డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం

మరిన్ని వార్తలు