ఫాంహౌస్‌లో అశ్లీల నృత్యాలు.. నటి అరెస్ట్‌

22 Jul, 2021 08:00 IST|Sakshi

తమిళనటి కవితశ్రీని అరెస్ట్‌ చేసిన పోలీసులు

తమిళసినిమా: విందు, విలాసాల పార్టీలు నిర్వహిస్తున్న సహాయ నటి కవితశ్రీ, అందులో పాల్గొన్న యువతీ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై తూర్పు సముద్రతీర ప్రాంతం, నీలాంగరై సమీపంలోని కానత్తూర్‌ ప్రాంతంలోని ఒక ఫాంహౌస్‌లో పార్టీ పేరుతో విందులు, విలాసాలతో యువతుల శృంగార డాన్సులు, రసజ్ఞులునైన యువకులతో వ్యాపారం జరుగుతోందన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో కానత్తూరు పోలీసులు మంగళవారం వేకువజామున ఫాంహౌస్‌కు వెళ్లారు. అక్కడ యువతీ యువకులు అరకొర దుస్తుల్లో మద్యం మత్తులో డాన్స్‌ చేస్తున్న దృశ్యాలు పోలీసుల కంటపడ్డాయి. దీంతో వారందరినీ అరెస్టు చేశారు.

విచారణలో రామాపురానికి చెందిన శ్రీజిత్‌కుమార్, సినీ సహాయనటి కవితశ్రీ కలిసి ఈ పార్టీలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వీరు సినిమా షూటింగ్‌ పేరుతో ఆ ఫాంహౌస్‌ను అద్దెకు తీసుకుని విలాసాలతో కూడిన విందు పార్టీలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ పార్టీలకు యువతులను డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నట్లు విందులో పాల్గొని యువకుల నుంచి రూ.5 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విధంగా కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీలను నిర్వహిస్తున్న  కవితశ్రీ సహా 11 మంది యువతులను, 16 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని బెయిల్‌పై విడుదల చేశారు.

మరిన్ని వార్తలు