తల్లితో వివాహేతర సంబంధం.. బిడ్డను గర్భవతి చేసిన డ్రైవర్‌

8 Jul, 2021 11:33 IST|Sakshi

బాలికను తల్లిని చేసిన డ్రైవర్‌ అరెస్ట్‌ 

తిరువళ్లూరు: నాలుగు నెలలుగా పరారీలో ఉన్న ఓ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా దేవందవాక్కం గ్రామానికి చెందిన డ్రైవర్‌ చరణ్‌రాజ్‌ అలియాస్‌ చరణ్‌రాజ్‌ (50) శ్రీపెరంబదూరులోని ప్రైవేటు కంపెనీలో బస్సు డ్రైవర్‌గా పని చేసేవాడు. అతనితో పాటు సత్తరై గ్రామానికి చెందిన కుప్పుస్వామి (45) బస్సు క్లీనర్‌గా పని చేస్తాడు. ఈ నేపథ్యంలో చరణ్‌రాజ్‌కు కుప్పుస్వామి భార్య కోమదితో అక్రమ సంబంధం ఏర్పడింది. భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో కోమది తన 13 ఏళ్ల కుమార్తెతో కలిసి పెద్దకుప్పంలో అద్దె ఇంట్లో చరణ్‌రాజ్‌తో కలిసి కొత్తకాపురం పెట్టింది.

ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల క్రితం బాలికకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించగా, గర్భిణి అని డాక్టర్లు చెప్పారు. చరణ్‌రాజ్‌ తరచూ బెదిరింపులకు గురి చేసి అత్యాచారం చేశాడని బాలిక చెప్పగా కోమది దీనిపై తిరువళ్లూరు మహిళా పోలీసు స్టేషన్‌లో నాలుగు నెలల కింద ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా పరారీలో ఉన్న చరణ్‌రాజ్‌ తిరువణ్ణామలైలో ఉన్నట్లు గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం తిరువళ్లూరు న్యాయమూర్తి అతనికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. చరణ్‌రాజ్‌ వల్ల గర్భం దాల్చిన బాలిక రెండు వారాల క్రితమే మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇద్దరూ బాలికల సంరక్షణ కేంద్రంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు