ప్రేమవివాహం.. భార్య గర్భవతి అని కూడా చూడకుండా..

11 Aug, 2021 18:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: తమిళనాడులో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎన్నో ఆశలతో తన మనస్సుకి నచ్చిన వ్యక్తితో యువతి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో  భర్త, అత్తింటి వారు అదనపు కట్నం తేవాలని వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ యువతి ..  ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మధురై జిల్లాలో 19 ఏళ్ల పండిశ్వరి అనే యువతి, తంగరాజ్‌ అనే వ్యక్తిని ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో...పండిశ్వరి గర్భం దాల్చింది.

గత కొన్ని రోజులుగా భర్త , అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించసాగారు. ప్రతిరోజు ఆమెను మానసికంగా, చిత్రహింసలకు గురిచేశారు. భర్త వేధింపులకు తట్టుకోలేక పండిశ్వరి తన తండ్రి వెల్లైస్వామికి విషయాన్ని తెలిపింది. దీంతో యువతి తండ్రి భర్తకు సర్దుబాటు చెప్పడానికి ఆమె ఇంటికి చేరుకున్నాడు. కాగా, యువతి తీవ్రమైన మనస్తాపంతో గత శనివారం (ఆగస్టు7)న కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

దీంతో ఆమెను వెంటనే స్థానిక రాజాజీ ఆసుపత్రికి తరలించారు. ఆమెను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. అయితే, ఆమె శరీరం వైద్యానికి స్పందించట్లేదని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమె గత సోమవారం అర్దరాత్రి మృతి చెందింది. కాగా, బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అల్లుడు, అతని కుటుంబ సభ్యులపై కేసును నమోదుచేశారు. కాగా, నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు మధురై పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు