స్నేహితుని పెళ్లి.. మత్తు ఎక్కువై రైలుపట్టాలపై పడుకుని..

11 Jun, 2022 06:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇద్దరి ప్రాణాలు తీసిన మద్యం మత్తు 

మరొకరి పరిస్థితి విషమం  

సాక్షి ప్రతినిధి, చెన్నై: స్నేహితుడి పెళ్లి రిసెప్షన్‌లో సంతోషంగా గడిపారు. మద్యం సేవిస్తూ మరింతగా సంబరం చేసుకునే క్రమంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరోవ్యక్తి ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు.. తూత్తుకూడి మూడవమై లు పశుంపొన్‌ నగర్‌కు చెందిన కె. మారిముత్తు (20), తిరువీక నగర్‌కు చెందిన ఎస్‌.మారిముత్తు (23), తిరునెల్వేలి జిల్లా పనకుడికి చెందిన ఎస్‌. జెపసింగ్‌ (23) స్నేహితులు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.

ఈనెల 9వ తేదీ (గురువారం)న తమ స్నేహితుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై రాత్రి 10 గంటలకు తూత్తుకూడి ఫ్‌లైఓవర్‌ బ్రిడ్జి కింద రైలుపట్టాలపై కూర్చుని మద్యం తాగారు. మత్తు ఎక్కువ కావడంతో ఒళ్లు తెలియని స్థితిలో పట్టాలపై తలపెట్టి పడుకుండిపోయినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో తూత్తుకూడి కొత్త హార్బర్‌లో లోడు ఎక్కించుకుని ఆంధ్రప్రదేశ్‌ వైపు బయలుదేరిన గూడ్సురైలు..పట్టాలపై తలపెట్టుకుని నిద్రిస్తున్న యువకులపై నుంచి వెళ్లింది. దీంతో ఎస్‌. మారిముత్తు, కె.మారిముత్తు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాలకు గురైన జపసింగ్‌ ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

చదవండి: భర్తతో విడిపోయి బతుకుతోంది.. లవ్‌ యూ అంటూ సహోద్యోగి వచ్చి.. చివరకు.. 


 


    

మరిన్ని వార్తలు