అల్లరి చేసింది.. చెప్పినా వినలేదని కూతురి తలపై..

11 Aug, 2022 15:37 IST|Sakshi
ప్రతకాత్మక చిత్రం

వేలూరు(చెన్నై): ఇంట్లో అల్లరి చేస్తోందని ఆగ్రహించిన తల్లి కన్న కూతురిపై కర్రతో దాడి చేసి హత్య చేసిన ఘటన తిరువణ్ణామలై జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. తిరువణ్ణామలై సమీపంలోని అరట్టాపట్టు గ్రామానికి చెందిన భూపాలన్‌ కూలీ కార్మికుడు. ఇతని భార్య సుకన్య. వీరికి పిల్లలు ప్రసన్న దేవ్, రితిక (06) ఉన్నారు. అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సుకన్య, భూపాలన్‌ మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండంతో సుకన్య అమ్మగారింట్లో పిల్లలతో జీవిస్తోంది. మంగళవారం ప్రభుత్వ సెలవు రోజు కావడంతో ఇద్దరు పిల్లలు ఇంట్లో ఆట్లాడుకుంటూ అల్లరి చేస్తున్నారు.

పలుమార్లు పిల్లలకు సర్ధిచెప్పినా వినకపోవడంతో ఆగ్రహించిన సుకన్య ఇంట్లో ఉన్న కర్రతో రితిక తలపై కొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు. దీంతో చిన్నారి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా దహన క్రియలు చేసేందుకు అమ్మగారింటికి తీసుకెళ్ళింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భూపాలన్‌కు సమాచారం అందించారు. భూపాలన్‌ తిరువణ్ణామలై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు తల్లి సుకన్యను అరెస్టు చేసి పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చదవండి: సమాజం తప్పుగా భావించింది.. మాది అన్నా చెల్లి బంధం

మరిన్ని వార్తలు