బీమా డబ్బుల కోసం భర్తనే...

10 Apr, 2021 19:29 IST|Sakshi

చెన్నై: బీమా డబ్బుల కోసం భర్తనే సజీవ దహణం చేసింది ఓ భార్య. ఈ దారుణం తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..  తుడుపతి నివాసి కె. రంగరాజు ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడడంతో వైద్యం కోసం కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. చికిత్స అనంతరం రంగరాజ్‌  తన భార్య, బంధువు రాజాతో కలిసి తుడుపతికి తిరుగు ప్రయాణమయ్యాడు. రాజా, జోతిమణిలు  మార్గం మధ్యలో నిర్మానుషమైన ప్రదేశంలో కారుని ఆపారు. వాహనం నుంచి దిగి, రంగరాజన్‌ను కారులో నుంచి బయట రాకుండా లాక్‌ చేశారు. అనంతరం కారుపై పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేశారు.

శుక్రవారం తెల్లవారుజామున, నిందితుడు రంగరాజన్‌ మరణం గురించి తిరుపూర్ పోలీసులకు ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగనట్లు సమాచారం ఇచ్చాడు. అయితే, అతని మాటల్లో పోలీసులకు అనుమానం రావడంతో దర్యాప్తును రాజా వైపు నుంచి మొదలుపెట్టారు. దీంతో అసలు బండారం మొత్తం బయట పడిందని పోలీసులు తెలిపారు. రంగరాజ్‌ వివిధ కారణాల కింద సుమారు 1.5 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. తరచూ అప్పు ఇచ్చిన వాళ్లు జోతిమణిని ఇబ్బంది పెట్టావారు. అయితే రంగరాజ్ పేరు మీద రూ.3.5 కోట్ల విలువైన మూడు బీమా పాలసీలు ఉన్నాయి. అందులో జోతిమణిని నామినీగా ఉంది. ఈ క్రమంలో తన భర్త చనిపోతే తనకి అప్పుల బాధ ఉండదని అలాగే బీమా డబ్బులు కూడా వస్తాయని ఆలోచనతో తన సమీప బంధువు రాజాతో జోతిమణి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో నిజాలను బయట పడ్డాయి.

( చదవండి: పెళ్లయిన 43వ రోజు భార్య గొంతు కోసి దారుణ హత్య ) 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు