షాప్‌ యజమానితో మహిళ సాన్నిహిత్యం.. మళ్లీ మాజీ భర్తతో కలిసిపోయే సరికి

7 Jul, 2022 10:35 IST|Sakshi

సాక్షి, చెన్నై: మహిళ అశ్లీల వీడియోలను మాజీ భర్తకు పంపిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. చెన్నై కొళత్తూరు ఎంజీఆర్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన యువతి (28) భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. అన్నాసాలైలోని ఓ బ్రౌజింగ్‌ సెంటర్‌లో పని చేస్తోంది. దుకాణం యజమాని అరుణాచలం (28) ఆమెతో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతని దగ్గర నగదు తీసుకుంది.

కొద్ది రోజులకు సదరు మహిళ భర్తతో కలిసి జీవిస్తోంది. దీంతో తనను మోసం చేసిందని గుర్తించిన అరుణాచలం.. ఆమెతో చనువుగా ఉన్న వీడియోలను భర్తకు పంపాడు. దీనిపై మహిళ విల్లివాక్కం మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్‌ అనురాధ కేసు నమోదు చేసి మంగళవారం అరుణాచలంను అరెస్టు చేశారు.  
చదవండి: పెళ్లి చేసుకుందామని అడిగితే.. కడుపు మీద తన్నడంతో..

మరిన్ని వార్తలు