మద్యానికి బానిసైన దంపతులు.. కన్నబిడ్డలని అమ్ముకున్నారు

31 Jul, 2021 21:21 IST|Sakshi

చెన్నై: మద్యానికి డబ్బులు లేకపోవడంతో కాసుల కోసం కన్నబిడ్డలనే అమ్మేశారు. అమ్మినవారు, కొనుగోలు చేసిన దంపతులు సహా ఆరుగురు కటకటాల పాలయ్యారు. నీలగిరి జిల్లా ఊటీలో నివసించే రబీన్‌ (29), మోనీషా (26) పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మద్యానికి బానిసైన దంపతులు పెద్ద కుమార్తె వర్ష (3)ను, మోనీషా తన అక్కకు అప్పగించారు. ఒకటిన్నరేళ్ల రెండో కుమార్తెను రూ.25వేలకు, మూడు నెలల కుమారుడిని రూ.30 వేలకు వేర్వేరు దంపతులకు అమ్మేశారు.

ఈ సొమ్ముతో పూటుగా మద్యం తాగి పెద్ద కుమార్తెను సైతం అమ్మివేయాలనే ఉద్దేశంతో మోనీషా తన అక్క ఇంటికి వెళ్లి ఘర్షణ పడడంతో విషయం తెలుసుకున్న ఆమె జిల్లా శిశు సంరక్షణ శాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి శిశువుల విక్రయం, కొనుగోలు నేరంపై పిల్లల తల్లిదండ్రులు రబీన్, మోనీషా, కొనుగోలు చేసిన రెండు జంటలు సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు