ప్రాణం తీసిన అనుమానం.. పెళ్లైన ఏడు నెలలకే

14 Jul, 2021 08:01 IST|Sakshi

భార్యను కడతేర్చిన భర్త 

తిరువొత్తియూరు/చెన్నై: అనుమానంతో వివాహమైన ఏడు నెలలకే భార్యను కడతేర్చి భర్త పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన చెన్నైలోని గిండిలో చోటుచేసుకుంది. చెన్నై గిండి లేబర్‌ కాలనీ లైన్స్‌ స్కూల్‌ రోడ్డుకు చెందిన నిత్యానందం (34) లగేజీ ఆటోడ్రైవర్‌. ఇతనికి ఏడు నెలల కిందట భువనేశ్వరి (23)తో వివాహమైంది. భువనేశ్వరి తరచూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఉండడంతో అనుమానించి సెల్‌ఫోన్‌లో మాట్లాడొద్దని ఆమెతో గొడవపడ్డాడు.

కానీ భువనేశ్వరి మాట్లాడడం మానలేదు. ఈ విషయమై సోమవారం రాత్రి తిరిగి దంపతుల మధ్య గొడవ ఏర్పడడంతో ఆగ్రహం చెందిన నిత్యానందం భార్యపై కత్తితో దాడి చేశాడు. దాడిలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. నిత్యానందం గిండి పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

టోడ్రైవర్‌ ఆత్మహత్య 
తిరువొత్తియూరు:  కానిస్టేబుల్‌ విచారణకు రమ్మని సెల్‌ఫోన్‌ను లాక్కోవడంతో గాజుముక్కతో గొంతు కోసుకుని ఓ ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై తిరు ముల్లవాయిల్‌ సమీపం అయ్యపాక్కం అయ్యప్ప నగర్‌ ఓం శక్తి వీధికి చెందిన భాగ్యరాజు (34) ఆటోడ్రైవర్‌. ఇతని స్నేహితుడు ప్రదీప్‌ (30). సోమవారం  వీరిద్దరు ఆ ప్రాతంలో వున్న చెరువు కట్టపై మాట్లాడుతున్నారు.

ఆ సమయంలో అక్కడికి వచ్చిన తిరుములైవాయల్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌ ఇద్దరి సెల్‌ఫోన్లు లాక్కున్నారు. పోలీసుస్టేషన్‌కు రావాలని తెలిపాడు. కానిస్టేబుల్‌తో భాగ్యరాజ్‌ గొడవ పడ్డాడు. ఆగ్రహం చెందిన కానిస్టేబుల్‌ భాగ్యరాజ్‌పై చేయిచేసుకున్నాడు.  భాగ్యరాజు అక్కడ పడి వున్న బీర్‌బాటిల్‌ గాజు ముక్కతో గొంతు కోసుకున్నాడు. ఈ ఘటనలో భాగ్యరాజ్‌ మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు