విద్యార్థినికి అబార్షన్‌.. యువకుడికి యావజ్జీవం

7 May, 2021 08:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యువకుడికి జంట యావజ్జీవ శిక్ష 

టీ.నగర్‌: విద్యార్థినికి అబార్షన్‌ చేయించిన యువకుడికి కోర్టు జంట యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పుదుక్కోట్టై సత్యమంగళం పసుంపొన్‌నగర్‌కు చెందిన సురేష్‌ (32). ఇతను అదే ప్రాంతానికి చెందిన ప్లస్‌టూ విద్యార్థినికి మాయమాటలు చెప్పి అనేకసార్లు లైంగికదాడి చేశాడు. విద్యార్థిని గర్భం దాల్చడంతో అబార్షన్‌ కోసం సురేష్‌ ఆమెకు మాత్రలు కొని ఇచ్చాడు.

దీంతో ఆమెకు అబార్షన్‌ కావడంతో ఆరోగ్యం క్షీణించింది. విద్యార్థిని తల్లిదండ్రులు 9 మార్చి 2019న పుదుక్కోట్టై మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద సురేష్‌ను అరెస్టు చేశారు. పుదుక్కోట్టై మహిళా కోర్టులో విచారణ జరిగింది. నిందితుడు సత్య సురేష్‌కు లైంగికదాడి నేరానికి ఒక యావజ్జీవశిక్ష, గర్భవిచ్ఛిత్తికి మరో యావజ్జీవశిక్ష అంటూ జంట యావజ్జీవశిక్షను న్యాయమూర్తి ఖరారు చేశారు.

చదవండి: వైర‌ల్‌: రాక్ష‌సుల క‌న్నా దారుణంగా ప్ర‌వ‌ర్తించారు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు