రెండు పెగ్గులేసి ‘పని’కానిద్దామనుకున్నారు.. అంతలోనే పోలీసుల కంటపడ్డారు

6 Sep, 2022 11:05 IST|Sakshi

చెన్నై: తమిళనాడులోని తిరువల్లూర్‌ జిల్లాలో ఇద్దరు మందుబాబుల ‘మద్యం చోరీ’ స్కెచ్‌ బెడిసికొట్టింది. మద్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకొని ఓ వైన్‌ షాప్‌ గోడకు కన్నం వేసిన దొంగలు.. తీరా లోపలున్న మందు సీసాలను చూశాక కాస్త ప్లాన్‌ మార్చుకున్నారు. ముందుగా ఓ రెండు పెగ్గులేసి గొంతు తడుపుకొని ఆ తర్వాత ‘పని’కానిద్దామనుకున్నారు.

అయితే అదే సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు గోడకున్న రంధ్రాన్ని చూసి షాపు వద్దకు వచ్చి చూడగా లోపలి తతంగం వారి కంటపడింది. అయితే దుకాణానికి తాళం వేసి ఉండటంతో వెళ్లిన ‘దారి’లోనే బయటకు రావాలని దొంగలను పోలీసులు ఆదేశించారు. దీంతో తిరిగి వారు రంధ్రంలోంచి బయటకు వచ్చాక అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చదవండి: గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి 

మరిన్ని వార్తలు